![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -146 లో.....చక్రి కోపంగా ఓంకారేశ్వర్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా నేను ఇచ్చిన ఐడియా ఎలా ఉందని ఓంకారేశ్వర్ అడుగుతాడు. నీ ఐడియాతో ఏకంగా ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అతడిని చక్రి కోప్పడతాడు. అయితే మరొక ప్లాన్ చెప్తానని అతను అనగానే వద్దని అతనిపై కోప్పడతాడు. మరొకవైపు అన్న శైలు వస్తుందని కేశవకి బంటి చెప్తాడు. వస్తే నాకెందుకు చెప్తున్నావని కేశవ అంటాడు.
ఇక నేను కలవను.. నీతో మాట్లాడనని కేశవతో చెప్పేసి శైలు అక్కడ నుంచి వెళ్తుంది. ఇక కేశవ అసిస్టెంట్ బంటి .. అన్నా.. తను వెళ్ళిపోతుందన్నా, వెళ్ళిపోయిందన్నా.. ఒక్కసారి చూడన్న అని కేశవ అసిస్టెంట్ బంటి అంటాడు. నిజంగానే శైలు వెళ్తుంది. దాంతో తన వెనకాలే కేశవ వెళ్తాడు. శైలు చెయ్ పట్టుకొని కేశవ ఆపుతాడు. నువ్వు వెళ్తానంటే నాకు ఏదో బాధగా ఉందని కేశవ అంటాడు. దీన్నే ప్రేమ అంటారని శైలు అంటుంది. నువ్వు నన్ను కన్ఫ్యూషన్ చెయ్యకని కేశవ అనగానే కేశవని శైలు హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మహా హాస్టల్ కి వెళ్తుంది. అక్కడ అందరు పేపర్ల మీద సారీ అని చక్రి రాసి పంపించింది మహాకి ఇస్తారు. ఏదో విధంగా చక్రి సారీ చెప్పమన్నాడంటూ, పాపం క్షమించొచ్చు కదా అని వాళ్ళంతా మహాతో అంటారు. దాంతో అందరిపై మహా కోప్పడుతుంది. మాధవ ఇంటికి వచ్చేసరికి కన్నా ఇంకా జ్వరంతో ఉంటాడు. చక్రిని చూసుకోమని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళాడని కన్నాని మాధవ అడుగుతాడు. ఆగు కేశవకి ఫోన్ చేస్తానని మాధవ అంటాడు. మరొకవైపు శైలు, కేశవ ఒక దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కేశవకి శైలు ముద్దు పెట్టబోతుంటే అప్పుడే మాధవ ఫోన్ చేస్తాడు. దాంతో కేశవ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బండోడు ఇంతసేపు తనకోసం ఉంటే కనీసం చెప్పకుండా వెళ్తున్నాడని శైలు అనుకుంటుంది.
ఆ తర్వాత మహాకి చక్రి గురించి దివ్య పాజిటివ్ గా చెప్తంటే.. మహా చిరాకుపడుతుంది. మరొకవైపు చక్రి ఇంటికి రాగానే మాధవ కోప్పడతాడు. ఇంట్లో కన్నాని చూసుకోమని చెప్పాను అయినా వదిలేసి వెళ్ళావని మాధవ అంటాడు. అందరు నన్ను అనేవాళ్ళే అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహాకి కన్నా ఫోన్ చేసి నాకు జ్వరం వచ్చింది వదిన.. నన్ను నీలాగా కేరింగ్ గా చూసుకునే వాళ్ళు లేరు.. నువ్వు రా వదిన అని కన్నా ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు కన్నాని చూడడానికి మహా వస్తుంది. తనని చూడగానే నారాయణ బీడీ పడేస్తాడు. ఆ తర్వాత నారాయణ ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నేనేం ఇక్కడ ఉండిపోవడానికి రాలేదని మహా అంటుంది. తరువాయి భాగంలో ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయావంట కదా.. మంచి నిర్ణయం తీసుకున్నావ్.. అందుకే నా కూతురిని ఆ ఇంటికి కోడలిగా పంపలేదని మహాతో తాయారు గుడిలో కలిసి అంటుంది. అక్కడ కన్నా కూడా ఉంటాడు. ఇక కన్నా ఎమోషనల్ గా మహాతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |